శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు

SRIRAM SAGAR

నిజామాబాద్‌: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1071 అడుగుల నీరు వచ్చి చేరింది. నీటి నిల్వ 90 టీఎంసీలకు గాను 31 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 5621 క్యూసెక్కులుగా ఉంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పై నుండి వరద నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/