నితిన్ ‘ఎక్స్ ట్రా… ఆర్డినరీ మ్యాన్’ టీజర్ రిలీజ్

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న నితిన్..ప్రస్తుతం ఎక్స్ ట్రా… ఆర్డినరీ మ్యాన్ మూవీ తో రాబోతున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కగా.. నితిన్ సొంత బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం అవుతుంది.

ఈ చిత్రంలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, అన్నపూర్ణమ్మ, పవిత్ర, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సోమవారం మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. మంచి వినోదభరితంగా సినిమా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.

https://youtube.com/watch?v=ieiUISyLNfM%3Fsi%3DZ-r0tn8DtJL-K_vB