మతి పోగొడుతున్న బుట్టబొమ్మ లేటెస్ట్ పిక్స్

చిత్రసీమలో గోల్డెన్ గా మారింది పూజా హగ్దే. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ అందుకొని ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ..ఆ తర్వాత డీజే మూవీ తో అసలైన హిట్ అందుకొని దర్శక , నిర్మాతల కళ్లలో పడింది. ఆ తర్వాత వరుస ఛాన్సులు అమ్మడి తలుపు తట్టడం..ఆ చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావడం తో అమ్మడి కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న పూజా..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను , అభిమానులను , నెటిజన్లను అలరిస్తుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకట్టుకుంటుంది. తాజాగా అమ్మడు షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ పిక్స్ తో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక తెలుగులో పూజా సినిమాల విషయానికి వస్తే..అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ లో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ప్రభాస్ సరసన రాధే శ్యామ్ , ఆచార్య మూవీ లో ప్రత్యేక పాత్ర చేస్తుంది. హిందీ లో సల్మాన్ ఖాన్ సరసన , తమిళ్ లో విజయ్ సరసన నటిస్తుంది. అంతే కాకుండా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో తెరకెక్కబోయే మూవీ లోను ఈ అమ్మడినే ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.