శ్యామ్ సింగరాయ్ నాల్గు రోజుల కలెక్షన్స్..ఇలా అయితే కష్టమే

వరుస పరాజయాలతో సతమతవుతున్న నేచురల్ స్టార్ నాని నటించిన తాజాగా చిత్రం శ్యామ్ సింగరాయ్. టాక్సీవాలా ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, సెబాస్టియన్ మడోన్నా హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి పాన్ ఇండియా గా నిర్మించారు. భారీ అంచల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. టాక్ బాగుండడం..క్రిస్మస్ సెలవులు కలిసిరావడం తో మొదటి మూడు రోజులు కలెక్షన్లు బాగానే రాబట్టినప్పటికీ సోమవారం మాత్రం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి.

నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 73 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, ఉత్తరాంధ్రలో 14 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరు జిల్లాలో 8 లక్షలు, నెల్లూరు జిల్లాలో 5 లక్షలు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలో 1.38 కోట్లు నికరంగా, 2.45 కోట్లు గ్రాస్ వసూళ్లను నాలుగో రోజున రాబట్టింది. 3వ రోజు వసూళ్లను పోల్చితే.. 60 శాతం కలెక్షన్లు తగ్గాయని ట్రేడ్ వర్గాలు చెపుతున్నారు.

రోజువారీగా చూస్తే..తొలి రోజున 4.17 కోట్లు, రెండో రోజున 4.38 కోట్లు, మూడో రోజున 3.52 కోట్లు, నాలుగో రోజున 1.38 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 13.45 కోట్లు నికరంగా, 22.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నైజాంలో 8 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రా 6 కోట్లు (అంచనా) తో కలిపి ఏపీ, తెలంగాణలో 16.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన చూస్తే శ్యామ్ ఇంకా గట్టిగానే రాబట్టాలి. ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా లేకపోవడం తో నానికి కలిసొచ్చే అంశమే. అయినాగానీ కలెక్షన్లు రాబట్టలేకపోతే నిర్మాతకు నష్టాలు తప్పవని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి శ్యామ్ సింగ రాయ్ ఏంచేస్థాడో చూడాలి.