మధ్యంతర బడ్జెట్ ఫై మండిపడుతున్న బిఆర్ఎస్ నేతలు

2024 -25 కు సంబదించిన మధ్యంతర బడ్జెట్ ను పార్లమెంట్ లో గురువారం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి. నిర్మలా బడ్జెట్ చెప్పినట్లు లేదు..మోడీ భజన చేసినట్లు ఉందని అంటున్నారు.

బడ్జెట్ ప్రసంగం మొత్తం కూడా సొంత డబ్బాలాగా ఉందని, అదిచేశాం. ఇది చేశామంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారని బిఆర్ఎస్ ఎంపీలు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపారని, విభజన హామీల అమలు, హక్కుగా రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆరోపించారు. బడ్జెట్ ఏ వర్గాన్ని సంతృప్త పరచ లేకపోయిందని అన్నారు.

ఒక్క కొత్త సంక్షేమ పథకం బడ్జెట్‌లో ప్రస్తవించలేదని దుయ్యబట్టారు. దేశంలో ద్రవ్యోల్బనం, నిరుద్యోగం నిర్మూలన దిశగా ఎలాంటి ప్రస్తావన లేదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచే ప్రణాళిక లేదని వెల్లడించారు. రైతులు, వ్యవసాయానికి ఉపయోగపడే విషయాలు లేకపోవడం విచారకరమని వారు అన్నారు. గత పది సంవత్సరాల్లో కేంద్రానికి ప్రత్యక్ష పన్నులు మూడింతలు రాగా వచ్చిన రాబడిని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదని పేర్కొన్నారు.