ఏ అధ్యక్షుడు చేయనంత నేను చేశాను

తప్పుడు కథనాలపై ట్రంప్‌ ఆగ్రహం

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తన పై వచ్చే ఫేక్‌ వార్తలపై మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ చేయలేనంత పని తాను చేశానని ట్రంప్‌ చెప్పారు. తాను తొలి మూడున్నరేళ్ల పదవీకాలంలో దేశం కోసం చేసినంత పని అమెరికా చరిత్రలోనే ఏ అధ్యక్షుడూ చేసి ఉండరని అభిప్రాయపడ్డారు. కాగా ప్రతి రోజు తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు తాను పని చేస్తూనే ఉంటానని ట్రంప్ చెప్పారు. కొన్ని నెలలుగా వైట్ హౌస్ లో ఉంటూనే పలు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని… మిలిటరీ వ్యవస్థను పునర్నిర్మించామని తెలిపారు. అయితే తన కృషిని తక్కువ చేస్తూ వస్తున్న కథనాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తప్పుడు కథనాలపై మీడియా కోసం సమయం వెచ్చించాల్సిన అవసరం లేదని శనివారం నుండి జరుగుతున్న రోజువారీ విలేకరుల సమావేశాల నుండి ఆయన దూరంగా ఉంటున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం చేయండి:https://www.vaartha.com/news/business/