భైంసా ఘర్షణపై నిర్మల్ కలెక్టర్ విచారణ
స్థానికుల నుంచి వివరాలు సేకరించిన కలెక్టర్ ప్రశాంతి

భైంసా: నిర్మల్ జిల్లా భైంసాలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ శాంతిభద్రతల సమస్యగా మారడం తెలిసిందే. 144 సెక్షన్ విధించడమే కాకుండా సున్నితమైన ప్రదేశాల్లో భారీగా పోలీసులను మోహరించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రశాంతి విచారణ షురూ చేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘర్షణ బాధితులను కలెక్టర్ పరామర్శించారు. భైంసాలో గత రాత్రి ఓ యువకుడు బైక్ పై దూసుకునిపోతుండగా, కోర్బా వీధిలో స్థానికులు అతడిని నిదానంగా వెళ్లాలని మందలించారు. దాంతో ఆ యువకుడు తన వర్గం వారిని భారీ సంఖ్యలో వెంటేసుకుని రావడంతో ఘర్షణ నెలకొంది. ఈ గొడవల్లో అనేకల నివాస గృహాలు దెబ్బతిన్నాయి. 4 ఆటోలు, 23 బైకులు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను అడ్డుకోబోయిన పలువురు పోలీసులు సైతం గాయపడ్డారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/