చివరి కోరికపై నిర్భయ దోషులు మౌనం

దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు

Nirbhaya convicts
Nirbhaya convicts

న్యూఢిల్లీ: నిబంధనలు ప్రకారం మరణశిక్ష విధింపబడిన ఖైదీలను చివరి కోరికలు ఏంటి అడగడం సాధారణమైన విషయం. అయితే నిర్భయ దోషులను కూడా అలాగే అడడగా వారు మౌనం వహించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయం హత్యోదంతం అందరికీ తెలిసిన విషయమే. కాగా ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు కాగా వారిని తీహార్‌ జైల్లో ఉరితీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ దోషుల్లో ఒకరు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టడంతో ఉరిశిక్ష అమలులో జాప్యం ఏర్పడింది. రాష్ట్రపతి ఈ అభ్యర్థనను తిరస్కరించడంతో ఢిల్లీ కోర్టు వారికి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరితీయాలని అధికారులను కోర్టు ఆదేశించింది. వారిన జైలు అధికారులు చివరి కోరిక ఏంటి అని అడగా వారు మౌనంగా ఉండిపోయినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కనిపిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/