ఇన్నోవేషన్‌ హబ్‌ల్లో హైదరాబాద్‌కు స్థానం లక్ష్యం

TS Minister Ktr in WES Summit

కృత్రిమ మేధ (ఎఐ) ఇన్నోవేషన్‌ హబ్‌ల్లో హైదరాబాద్‌కు స్థానం లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు.. 2030 నాటికి ప్రపంచంలోని జిడిపిలో ఎఐ వాటా దాదాపు 40శాతం ఉంటుందని ఆయన అంచనాగా తెలిపారు.. ప్రపంచంలోని టాప్‌ 25 కృత్రిమ మేధ హబ్‌లో హైదరాబాద్‌కు స్థానం కల్పించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.. దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరం (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సులో జరిగిన ప్యానెల్‌ డిస్కషన్‌లో తెలంగాణ మంత్రి కెటిఆర్‌ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాదిని తెలంగాణలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఏడాదిగా ప్రకటించించామన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/