టర్కీ దేశానికి కొత్త పేరు..ఐక్య‌రాజ్య‌స‌మితి ఆమోదం

UN agrees to change Turkey’s official name to ‘Türkiye’

అంకారా: తమ దేశం పేరుపై టర్కీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్‌లో ఆ దేశాన్ని ట‌ర్కీ(Turkey) అని పిలుస్తారు. అయితే ఇక నుంచి త‌మ దేశాన్ని టర్కీయే(Türkiye) అని పిలువాల‌ని ఆ దేశం ఐక్య‌రాజ్య‌స‌మితిని కోరింది. యూఎన్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఆంటోనియో గుటెర్ర‌స్‌కు తుర్కై విదేశాంగ మంత్రి క‌వ‌సొగ్లూ లేఖ రాశారు. ట‌ర్కీ ప్ర‌భుత్వం పంపిన లేఖ‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు యూఎన్ తెలిపింది. అయితే పేరు మార్పు ప్ర‌క్రియ గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ప్రారంభ‌మైంది. అధ్య‌క్షుడు రీసెప్ త‌య్య‌ప్ ఎర్డ‌గాన్ నేతృత్వంలో ఆ ఉద్య‌మం సాగిన‌ట్లు విదేశాంగ మంత్రి వెల్ల‌డించారు. దేశ బ్రాండ్ వాల్యూను పెంచే ఉద్దేశంతో తాము ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌వ‌సొగ్లూ తెలిపారు. యూఎన్‌కు లెట‌ర్ అందిన రోజు నుంచే కొత్త పేరును అమ‌లులోకి తీసుకువ‌చ్చారు. ట‌ర్కిష్ ప్ర‌జ‌ల సంస్కృతి, నాగ‌రిక‌త‌, విలువ‌ల‌కు కొత్త పేరు ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌తిబింబిస్తుంద‌ని గ‌తంలో అధ్య‌క్షుడు ఎర్డ‌గోన్ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/business/