‘నిర్భయ’ దోషులకు ఉరి
తీహార్ జైలులో అమలు

Delhi: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది.
దిల్లీలోని తీహార్ జైలులో ఈ నలుగురికీ అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురు దోషులూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తీహార్ జైలు డైరక్టర్ జనరల్ సందీప్ గోయెల్ వెల్లడించారు.
తన కుమార్తె హత్యకు కారకులు నలుగురికీ ఎట్టకేలకు శిక్ష అమలైంది. తన సుదీర్ఘ పోరాటంలో న్యాయం దక్కిందనినిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు.
ఈ రోజును ఈ దేశంలోని అమ్మాయిలందరికీ అంకితం చేస్తున్నానన్నారు.
నిర్భయ దోషులకు ఉరి అమలు ఈ దేశంపై, న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని ఆమె వ్యాఖ్యానించారు.
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/