బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

rajasingh

రేపటి మునావర్ ఫారుఖీ షోను అడ్డుకుంటామని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడంతో… ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకుని లాలాగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మునావర్ ఫరూకీ కామెడీ షోకి తెలంగాణ సర్కార్ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఇప్పుడు బిజెపి vs టిఆర్ఎస్ గా మారింది. దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మునావర్ , ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ తను షో నిర్వహిస్తున్నాడు. రేపు(శనివారం) హైటెక్స్ కామెడీ షోను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కామెడీ షో వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

మునావర్‌ కామెడీ షోకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తప్పుబట్టారు. మునావర్‌ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రేపు జరగబోయే షోను అడ్డుకుంటామని అన్నారు. హిందూ వ్యతిరేకి అయిన మునావర్ కామెడీ షో హైదరాబాద్‌లో నిర్వహించడానికి వీల్లేదని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆయన హైదరాబాద్‌కు వస్తే అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు.