కొండపోచమ్మ ఆలయంలో కెసిఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు

చండీహోమం పూర్ణాహుతిలో పాల్గొన్న సిఎం దంపతులు

CM KCR Reaches To Kondapochamma Temple, Offer Prayers

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్‌ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం తీగుల్‌ నర్సాపూర్‌ చేరుకున్న సిఎం కెసిఆర్‌ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు.. సిఎం దంపతులకు వేదాశ్వీరచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత హోమ నిర్వాహకులు సిఎం కెసిఆర్‌‌కు అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. పూర్ణాహుతి ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్‌‌ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి బయల్దేరి వెళ్లారు. ఉదయం 9: 35 గంటలకు ఎర్రవల్లి రైతు వేదికకు సీఎం భూమిపూజ చేయనున్నారు. 9: 45 గంటలకు మర్కుక్ లో రైతు వేదికకు భూమి పూజ చేస్తారు. ఉదయం 10 గంటల సమయంలో మర్కూర్‌ పంప్‌హౌస్‌ వద్ద నిర్వహించే సుదర్శనయాగం పూర్ణాహుతిలో కెసిఆర్‌‌ దంపతులు, త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామీ పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్‌ పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తారు. ఉదయం 11:35 గంటలకు కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్కూక్‌ మండల కేంద్రంలోని వరదరాజస్వామి దేవాలయంలో సిఎం పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సిఎం సమావేశం నిర్వహిస్తారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/