షర్మిల ఫై మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఫైర్

వైస్ షర్మిల ఫై టీఆరఎస్ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. గత కొద్దీ నెలలుగా షర్మిల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో పాదయాత్ర పూర్తి చేసిన ఈమె..శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సందర్భాంగా మంత్రి నిరంజన్ రెడ్డి ఫై మాటాల తూటాలు పేల్చారు. తాను ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తుంటే.. ఈ నిరంజన్ రెడ్డి తనను గతంలో మంగళవారం మరదలు అన్నారని షర్మిల గుర్తు చేశారు. ఎవర్రా మరదలు.. సిగ్గుండాలి కదా అంటూ ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మెట్టు దెబ్బలు తింటారు జాగ్రత్త అని హెచ్చరించారు.

నిరంజన్ రెడ్డి పరాయి స్త్రీలో తల్లిని, చెల్లిని చూడలేని సంస్కారహీనుడని షర్మిల అన్నారు. ఆయనకు, కుక్కకు తేడా ఏమైనా ఉందా..? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నా పోరాటంలో నీకు మరదలు కనిపించిందా అని మంత్రిపై షర్మిల ఫైర్ అయ్యారు. నిరంజన్ రెడ్డికి అధికార మదం తలకెక్కిందని ఆరోపించారు. ఇక షర్మిల చేసిన కామెంట్స్ ఫై నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే.. ఒక్కమాటకు వందమాటలు అంటాం.. ఆత్మ‌విశ్వాసంతో చీల్చి చెండాడుతామ‌ని తేల్చిచెప్పారు. రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటి చేసి నీ సత్తా ఏంటో చూపించాల‌ని ష‌ర్మిల‌కు నిరంజ‌న్ రెడ్డి స‌వాల్ విసిరారు. గోపాల్‌పేట మండల ప‌రిధిలోని 16 గ్రామపంచాయతీలకు చెందిన 1331 మందికి నూతన ఆస‌రా ఫించను గుర్తింపు కార్డులను మంత్రి నిరంజ‌న్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా షర్మిల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.