జాతీయ పార్టీ కోసం మూడు పేర్లను సిద్ధం చేసిన కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..దసరా సందర్భాంగా జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అన్ని సిద్ధం చేసి ఉంచారు. కాగా ఈ పార్టీ పేరు కోసం మూడు పేర్లను అనుకున్నారట..ఆ మూడు పేర్లలో ఫైనల్ గా ఒకదానిని ప్రకటించబోతారని సమాచారం. భారత రాష్ట్ర సమితి, భారత నిర్మాణ సమితి, భారత ప్రజా సమితి పేర్లను ఆయన పరిశీలిస్తున్నారు. వీటిలో ఒక పేరును ఆయన ఖరారు చేయనున్నారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇటీవలే బీహార్ కు వెళ్లి సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను ఆయన కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కురమారస్వామిని కలిసేందుకు రేపు ఆయన బెంగళూరుకు వెళ్తున్నారు.

కేంద్రంలో బీజేపీ అసమర్థ, నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు ఇప్పటికే మోడీకి భయపడి పక్కకు తప్పుకొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కాంతిపుంజంలా కనిపిస్తున్న నేత కేసీఆర్. ఈ పేరు మూడు దశాబ్దాలుగా దేశ ప్రజలకు సుపరిచితమే. లక్ష్య సాధనకోసం ఎంతటి త్యాగాలకైనా వెనుకాడని పోరాట యోధుడిగా తెలంగాణ ఉద్యమ కాలంలో భారతీయులందరికీ కేసీఆర్‌ ఒక చైతన్యమూర్తి. తెలంగాణ ముఖ్యమంత్రిగా గొప్ప దార్శనికత ఉన్న పాలకుడిగా నేడు ప్రగతి ప్రదాత. అందుకే దేశమంతా ఇప్పుడు కేసీఆర్‌ వైపు చూస్తున్నది. మోడీకి, బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం కేసీఆరే అన్న నిర్ధారణకు వస్తున్నది. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి సిద్ధమయ్యారు. మరి జాతీయ పార్టీ కి కేసీఆర్ ఏ పేరు పెడతారో చూడాలి.