సీఐ అంజుయాదవ్‌కు హెచ్‌ఆర్సీ నోటీసులు

nhrc-notice-to-srikalahasti-ci-anju yadav

అమరావతిః శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కి హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల క్రితం జనసేన కార్యకర్తను కొట్టిన అంజూయాదవ్‌తో సహా స్టేషన్‌ ఆఫీసర్‌, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. విచారణ జరిపి ఈనెల 27న నివేదిక సమర్పించాలని, శ్రీకాళహస్తి సిఐ, తిరుపతి డిఎస్పి,ఎస్పి లకు ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆందోళన చేస్తున్న జనసేన నేతలపై చెంపదెబ్బలతో విరుచుకుపడ్డారు అంజు యాదవ్‌. జనసేన కార్యకర్త సాయి పై సీఐ అంజు యాదవ్ చేయి చేసుకోవడంపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది.