మూడు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ

వెల్లింగ్టన్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ వరుసగా మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(79 పరుగులు 141 బంతుల్లో), హెన్రీ నికోలస్(2 పరుగులు 26 బంతుల్లో) బ్యాటింగ్ చేస్తున్నారు. 57 ఓవర్లు పూర్తయ్యే సరికి కివీస్ మూడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కాగా రెండవ రోజు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా మూడు వికెట్లు పడగొట్టి ఇషాంత్ శర్మ తన ప్రదర్శనను కనబరుస్తున్నాడు. కాగా గడచిన టీమిండియా బ్యాటింగ్లో 68 ఓవర్లకు గానూ 165 పరుగులు మాత్రమే చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana