రాజకీయాల్లోకి సైనా నెహ్వల్‌.. పార్టీ ఏదో తెలుసా?

Saina Nehwal
Saina Nehwal

న్యూఢిల్లీ: భారత స్టార్ బ్యాండ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం క్రీడాకారిణిగా దేశం కోసం శ్రమించిన సైనా… ఇకపై ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతోంది. బిజెపి ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతోంది. ఈరోజు ఆమె బిజెపి పెద్దల సమక్షంలో అధికారికంగా కాషాయ కండువా కప్పుకోబోతోంది. 29 ఏళ్ల సైనా ముందు నుంచి కూడా బిజెపి మద్దతుదారుగానే ఉంది. గతంలో కూడా సైనా ప్రధాని మోడీని అనేక సార్లు కలుసుకుంది. ఇంత కాలం బ్యాడ్మింటన్ లో సత్తా చాటిన సైనా ఇకపై రాజకీయాల్లో తనదైన ముద్రను వేయబోతోంది. తన కెరీర్ లో 24 ఇంటర్నేషనల్ టైటిల్స్ ను సైనా గెలుచుకుంది. 2009లో ప్రపంచ నెంబర్ టూ స్థానంలో కొనసాగినా సైనా… 2015లో వరల్డ్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆమె 9వ స్థానంలో కొనసాగుతోంది. 2018లో ఆమె మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడింది.

తాజా ఆంద్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/