ఆద్యంతం ఆహ్లాదకరమైన ట్యూన్

నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా భీష్మ. రష్మిక మందన కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సందర్భంగా పోస్టర్ ప్రచారం.. లిరికల్ ప్రచారం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుంచి సరా సరి.. అంటూ సాగే ఓ మెలోడీ ని రిలీజ్ చేశారు. పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ట్యూన్ తో మైమరిపిస్తోంది.

ఎంతో క్యాచీగా ఉన్న ట్యూన్.. దానికి తగ్గట్టే పల్లెటూరి నేపథ్యంలోని విజువల్స్ మనసు దోచేయడం ఖాయంగానే కనిపిస్తోంది. “సరా సరి గుండెల్లో దించావే.. సరా సరి మైకంలో ముంచిందే..అయినా గానీ ఈ బాధ బావుందే..“ అంటూ అద్భుతమైన పదజాలంతో లిరిక్ మైమరిపించింది

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/