లాజిక్ ను అర్థం చేసుకున్నా

Rakulpreet Singh

టాలీవుడ్ లో లక్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ..
ప్రస్తుతం ఈమెను టాలీవుడ్.. కోలీవుడ్ లో పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో తన చేతుల్లోకి వచ్చిన ఆఫర్లు చేజారి పోయాయని.. తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్స్ చేశారంది. అయితే తన వరకు వచ్చి వెళ్లిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయంటూ చెప్పుకొచ్చింది ఇక్కడ హీరోలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రాగలరు. అందుకే వారికి భారీ పారితోషికాలు ఉంటాయి. ఆ స్థాయిలో హీరోయిన్స్ కు ఉండాలని నేను అనుకోను. ఈ లాజిక్ ను అర్థం చేసుకున్నాను. అందుకే నేనెప్పుడు పారితోషికం విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదంటూ చెప్పుకొచ్చింది. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/