రష్యాలో కొత్తగా 6,109 కరోనా కేసులు

మొత్తం ‌ కేసుల సంఖ్య 7,71,546

Russia-corona virus

మాస్కో: రష్యాలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,109 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,71,546కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా రాజధాని మాస్కోలో నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 95 మంది చనిపోయారు. కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 12,342కు చేరింది. మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్నది. గడిచిన 24 గంటల్లో 3,481 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 5,50,344కు పెరిగింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/