రేపటి నుంచి కొత్త అంబులెన్స్‌లు ప్రారంభం

vijayasai reddy
vijayasai reddy

అమరావతి: సిఎం జగన్‌ నాయకత్వంలో పేదల చెంతకే వైద్యం అందబోతోందని, మరోసారి ఏపి ప్రజలు వైఎస్​ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటున్నారని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డి మంగళవారం ట్వీట్​ చేశారు. ప్రజారోగ్యం పట్ల సిఎం వైఎస్​ జగన్​ తపనకు కార్యరూపంగా సరికొత్త హంగులతో 108, 104 వాహనాలు బుధవారం (జులై 1) నుంచి అందుబాటులోకి రాబోతున్నాయని పేర్కొన్నారు. 203 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన అంబులెన్సులు, మొబైల్​ క్లినిక్స్​లో వెంటీలేటర్లు, ఈసీజీ, లైఫ్ సపోర్టు వ్యవస్థలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఏపిలో ఇప్పుడు 108 వాహనాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చింది. సరికొత్త హంగులతో 108,104 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి.  జగన్  హయాంలో పేదల  చెంతకే వైద్యం అందబోతోందని’ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/