వైజాగ్ లో ఘోర బైక్ ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి

వైజాగ్ లో జరిగిన ఘోర బైక్ ప్రమాదం లో ముగ్గురు యువకులు మృతి చెందారు. జిల్లాలోని వెంకోజిపాలెం జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో మద్దిలపాలెం వైపు వస్తున్న బైక్‌ను ట్రాక్టర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. హనుమంతు వాక నుంచి మద్దిలపాలెం వైపు బైక్ ఫై ముగ్గురు యువకులు వెళ్తుండగా..ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూడా అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాలు కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సాయి, దుర్గా ప్రసాద్, గోపీలుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్‌ను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.