ఆస్ప‌త్రిలో చేరిన నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవి భండారీ

Nepal President Bidhya Devi Bhandari hospitalise

ఖాట్మాండుః నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవి భండారీ (61) అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆమెను హుటాహుటిన రాజ‌ధాని ఖాట్మండులోని త్రిభువ‌న్ యూనివ‌ర్సిటీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. విద్యాదేవి భండారీ శుక్ర‌వారం నుంచి జ‌లుబు, జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార‌ని, శ‌నివారం స‌మ‌స్య మ‌రింత తీవ్రం కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్పించామ‌ని ఆమె సెక్రెట‌రీ భేష్ రాజ్ అధికారి తెలిపారు.

ఆస్ప‌త్రిలో వైద్యులు ఆమెకు అన్ని ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించార‌ని, రిపోర్టులు రావాల్సి ఉంద‌ని భేష్ రాజ్‌ చెప్పారు. విద్యాదేవి భండారి నేపాల్‌కు మొద‌టి మ‌హిళా అధ్య‌క్షురాలు. అంతేగాక వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు దేశాధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపికైన వ్య‌క్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు. ఆమె మొద‌టిసారి 2015లో దేశాధ్య‌క్షురాలు కాగా, 2018లో మ‌రోసారి ఆ ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఆమె ప‌ద‌వీకాలం పూర్తికానుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/