నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ నీట్ పీజీ పరీక్షని కేంద్రం వాయిదా వేసింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2022 పీజీ పరీక్షను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పరీక్షను 6 నుంచి 8 వారాల వరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 12 నిర్వహించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం దీన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంటర్న్ షిప్ కు సంబంధించి ఓ కేసు విచారణలో ఉంది. పీజీ పరీక్ష వాయిదా… ఇంటర్న్ షిప్ కు సంబంధించి విచారణ ముందుగా సుప్రీం కోర్టులో ఫిబ్రవరి 7న విచారించాల్సి ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/