డైరెక్టర్ గా మారుతున్న కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన..

కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన అంటే తెలియని సినీ లవర్స్ ఉండరు. 2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. ‘బాద్ షా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరోయిన్లు చాలామంది పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గానూ వర్క్ చేస్తుంది. తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కి కూడా ఈమె పనిచేస్తుంది. కాగా ఇప్పుడు ఈమె డైరెక్టర్ అవతారమెత్తబోతుంది. ఈ విషయాన్ని హీరో నితిన్ రివీల్ చేసారు.

నీరజ డైరెక్టర్ అవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేస్తూ, స్క్రిప్ట్ కూడా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూస్తుంటే.. నీరజ కోన డైరెక్ట్ చేసే మూవీలో హీరో నితిన్ అని తెలుస్తోంది. మిథున్ చైతన్య స్టోరీ అందించగా, దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్.. ఈప్రాజెక్టు కోసం వర్క్ చేయనున్నారు. ఇప్పటికే తిక్క, ఛల్ మోహనరంగ, మిస్ ఇండియా సినిమాల్లో సాంగ్స్ కోసం లిరిక్స్ రాసిన నీరజ.. ఇప్పుడు డైరెక్టర్ కావడం హాట్ టాపిక్ గా మారింది.