నల్గొండ జిల్లాలో దారుణం..ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

రోజు రోజుకు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం..ప్రేమించకపోతే దాడులు చేయడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకోగా..తాజాగా నల్గొండ జిల్లాలో ఇదే తరహా దారుణం జరిగింది. ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది యువతీ గొంతుకోశాడు. ప్రస్తుతం సదరు యువతీ హాస్పటల్ లో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది.

వివరాల్లోకి వెళ్తే..

నల్గొండ జిల్లాలో డిగ్రీ చదువుతున్న నవ్య అనే యువతీ ని గత కొంతకాలంగా రోహిత్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నాడు. రోహిత్ ప్రేమను నిరాకరిస్తుండడంతో కోపం పెంచుకున్న రోహిత్.. బ్లెడ్ తో నవ్య గొంతుకోశాడు. అతణ్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నించిన నవ్వ చివరకు విఫలమైంది. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో రోహిత్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నవ్యను ఆస్పత్రికి తరలించారు.

తన కుమార్తెను రోహిత్ కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని నవ్య తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ప్రేమను నిరాకరించడం వల్లే తన కూతురిని చంపడానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసిన రోహిత్ ను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.