జగ్గారెడ్డి వ్యాఖ్యలపై చర్చిచాం.. ఇప్పుడు అంతా సర్దుకుంది: భట్టి

పార్టీ వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించామన్న మల్లు

bhatti vikramarka
bhatti vikramarka

హైదరాబాద్ః సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరియు తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందని చెప్పారు. ఇప్పుడు అంతా సర్దుకుందని అన్నారు.

హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న దోస్తీ బయట పడిందని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/