కన్నుల పండుగగా నయనతార వివాహం

నయనతార -విఘ్నేష్ ల వివాహం కన్నుల పండుగగా జరిగింది. ఈరోజు ఉదయం మహాబలిపురంలో ఉన్న షెరటాన్ గ్రాండ్ హోటల్ లో సన్నిహితులు , కుటుంబ సభ్యులు , సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం చాలా అంగరంగవైభవంగాజరిగింది. సుమారుగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకుంటున్న వీరు ఎవరికీ తెలియకుండా 2021లో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నేడు హిందూ సాంప్రదాయ పద్ధతి లో విగ్నేష్ శివన్ చేత మూడుముళ్ల వేయించుకొని సరికొత్త అధ్యయనాన్ని ప్రారభించింది.

తన చిరకాల ప్రేయసిని పెళ్లాడిన విఘ్నేశ్‌ ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ తన అర్ధాంగికి నుదుటన ముద్దు పెట్టిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ‘నయన్‌, నేను ఒక్కటయ్యాం.. భగవంతుడి ఆశీస్సులు, తల్లిదండ్రులు, స్నేహితులు, అందరి ఆశీస్సులతో మా పెళ్లి జరిగింది’ అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు చిలకా గోరింకల్లా ఉన్నారు, నిండునూరేళ్లు కలిసి జీవించండి అని ఆశీస్సులు అందిస్తున్నారు. ఇక ఈ పెళ్లి వేడుకకు సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరో కార్తి,​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్​, మణిరత్నం, అజిత్​, విజయ్​తో పాటు టాలీవుడ్​, శాండల్​వుడ్​కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.