భారత్‌లోనే కరోనా మరణాల రేటు తక్కువ!

3.2 శాతంగా ఉందని కేంద్రం ప్రకటన

corona patient dead body

న్యూఢిల్లీ: ప్రపంచదేశాలను అతలాకుతలం చేసున్న కరోనా కారణంగా భారతదేశంలో మరణించిన వారి శాతం ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్‌లో కరోనా మరణాల రేటు 3.2 శాతంగా ఉందని, ఇది ప్రపంచ దేశాల సగటుతో పోల్చుకుంటే అతి తక్కువని తెలిపింది. అదేవిధంగా కరోనా నుండి కోలుకునే వారిశాతం కూడా రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 10,633 కు చేరుకుంది. ఈ వైరస్‌ నుండి కోలుకుంటున్న వారి శాతం 26.59 గా ఉందని కేంద్రం తెలిపింది. కొద్ది రోజుల క్రితం కరోనా కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం 10.5 రోజులు ఉండగా.. అది ఇపుడు 12 రోజులకు చేరిందని కేంద్ర మంత్రి తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/