సీఎం స్టాలిన్ ను పెళ్ళికి ఆహ్వానించిన నయనతార – విగ్నేష్

లేడి సూపర్ స్టార్ నయనతార అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రేమించిన వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకోబోతుంది. గత కొద్దీ ఏళ్లుగా డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మూడు ముళ్ల బంధం తో ఒకటికాబోతున్నారు. మ‌హాబ‌లిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో విఘ్నేష్ శివ‌న్, న‌య‌న తారల‌ పెళ్లి జ‌రుగ‌నుంది. హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం జూన్ 9న గ్రాండ్‌గా జ‌రుగ‌నుంది. కోలివుడ్ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం జూన్ 8 సాయంత్రం అంటే పెళ్ళికి ముందు రోజు భారీ ఎత్తున రిసెప్ష‌న్ కూడా ఉండ‌బోతుంద‌ని టాక్‌.

ప్రస్తుతం వెడ్డింగ్ కార్డ్స్ ను పంచేపనిలో వీరిద్దరూ బిజీ గా ఉన్నారు. తాజాగా శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్‌ బర్డ్స్‌ తమ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇక‌ ఉద‌య‌నిధితో ఇత్తు క‌తివెల‌న్ కాద‌ల్ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో శ్రీనుగాడి ల‌వ్‌స్టోరి పేరుతో డ‌బ్ అయింది. వీరితో పాటుగా క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జినీ కాంత్, అజిత్, విజ‌య్, సూర్యల‌తో సహా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్ళికి హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా టాలీవుడ్ నుంచి కూడా పులువురు స్టార్లు హాజ‌రుకానున్నార‌ట‌.