రెండు రోజుల్లో బాలిక అత్యాచార ఘటన నివేదిక ఇవ్వాలని సీఎస్..డీజీపీకి తమిళసై ఆదేశాలు

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచార ఘటన కు సంబంధించిన పూర్తి నివేదిక ను రెండు రోజుల్లో ఇవ్వాలని గవర్నర్ తమిళసై సీఎస్..డీజీపీకి ఆదేశాలు జారీచేశారు. కాగా ఈ అత్యాచార ఘ‌ట‌న త‌న‌ని తీవ్రంగా క‌లిచివేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు జూబ్లీహిల్స్ రేప్ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. నిందితులంతా రాజ‌కీయ నేత‌ల కొడుకులుగా గుర్తించారు పోలీసులు.

మరోపక్క ఈ అత్యాచార ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి ఉమర్‌ఖాన్‌ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు… ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో మైనర్‌ నిందితుణ్ని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అసలు ఏం జరిగిందనేది చూస్తే…గత నెల 28న ఓ బాలిక (17) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఓ పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చింది. దాదాపు 150 మంది 28వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడే మద్యం రహిత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ముగిసే సమయానికి పావుగంట ముందు పబ్‌ నుంచి బాలిక బయటకు వచ్చింది.అక్కడే ఉన్న రెండు కార్లలో యువతితో పాటు మరో 8మంది యువకులు బయల్దేరారు. ఇందులో బెంజికారుతో పాటు ఇన్నోవా కారు కూడా ఉంది. బెంజికారులో ప్రముుఖుల కుమారులు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక.. వారితో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరింది. నిర్జన ప్రాంతంలో కారు ఆపి అందులో ఉన్న ఐదుగురు.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. మరోసటీ రోజు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ..పోలీసులకు పిర్యాదు చేసారు.