యోగి బర్త్ డే సందర్బంగా అతి పొడ‌వైన కేక్ ని త‌యారు చేసిన ఫ్యాన్స్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 50 వ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా అభిమానులు అతి పొడ‌వైన కేక్ ని త‌యారు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మేర‌కు ఈ కేక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలోకి చోటు సంపాదించుకోనుంది. దీని పొడువు 111 అడుగులు. ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కేక్ రికార్డ్ 108.27 అడుగులు ఉండగా, అది చెరిగిపోనుంది.ప్రపంచంలో అతి పొడవైన కేక్ ను కోసిన రికార్డు సృష్టించాలన్న లక్ష్యంతో ఈ కేక్ ను రూపొందించారు.

బీజేపీ నవాజ్ గంజ్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్య నియోజకవర్గం పరిధిలో ఆదివారం సాయంత్రం ఈ కేక్ ను కట్ చేయనున్నారు. 150 క్వింటాళ్ల ఉక్కుతో తయారైన నిర్మాణంసౌలో దీన్ని ఉంచనున్నారు. ముఖ్యమంత్రి శాంతియుత పాలన అందిస్తునందుకు ఈ కేక్ ను పీస్ ఆఫ్ కేక్ గా బీజేపీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఇక యోగి బర్త్డే సందర్బంగా పార్టీ నేతలు , కార్య కర్తలు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందజేస్తూ వస్తున్నారు.

ప్రధాని మోడీ యోగి ఆదిత్యనాథ్ ను ‘డైనమిక్ సీఎం’అని ప్రశంసించారు. యోగి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో నూతన శిఖరాలను చేరుకున్నట్టు ప్రకటించారు. ‘‘రాష్ట్ర ప్రజలకు ప్రజా అనుకూల పాలనకు భరోసా ఇచ్చారు. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించి ప్రజల కోసం సేవ చేయాలి’’అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ట్విట్టర్ ద్వారా విష్ చేశారు. ‘‘ఉత్తరప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి పూర్తి అధికారం, వ్యూహంతో పనిచేస్తున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సంక్షేమం కోసం విరామం లేకుండా అంకితభావంతో పనిచేస్తున్నారు’’అని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. 1972 జూన్ 5న ఆదిత్యనాథ్ జన్మించారు.

బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’అని మాయావతి ప్రకటించారు.