ప్రధానితో రేపు త్రివిధ దళాధిపతుల సమావేశం

pm modi

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ ను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికి కేంద్రం మాత్రం అగ్ని పథ్ ను వెనక్కు తీసుకోవడం లేదు.ఈరోజు అగ్నివీర్ కు సంబదించిన నోటిఫికేషన్ ను సైతం విడుదల చేసింది. ఇదిలా ఉంటె రేపు త్రివిధ దళాల అధిపతులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కాబోతున్నారు. అగ్నిపథ్ స్కీమ్ పై వారు ప్రధాని మోడీకి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

మరోపక్క అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎంఎల్ శర్మ (మనోహర్ లాల్ శర్మ) అనే న్యాయవాది ఈ పిల్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కేంద్రం (రక్షణశాఖ) ప్రకటించిన అగ్నిపథ్ నోటిఫికేషన్ భారత రాజ్యాంగానికి తీవ్ర విఘాతం కల్గిస్తుందని, ఇది చట్ట వ్యతిరేకమని పిటిషన్ లో ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. ఇక ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్‌ పోరాటానికి సిద్ధమయ్యారు.

ఈ నెల 24వ తేదీన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నిరసనలు చేస్తుందని రాకేష్ తికాయిత్‌ తెలిపారు. సంయుక్త కిసాన్‌ మోర్చాకు చెందిన పలు రైతు సంఘాల నేతలు సోమవారం (జూన్ 20న) సమావేశమయ్యారు. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో, ప్రధాన కార్యాలయాల్లో ఐక్య కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేస్తామని రాకేష్‌ తికాయిత్‌ తెలిపారు.