వరంగల్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది

వరంగల్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) జాబితాలో వరంగల్ చేరింది. యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

దీంతోపాటు వరంగల్ తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ ఓరుగల్లుు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

సరిగ్గా ఏడాది తరువాత యునెస్కో నుంచి మరో అరుదైన గుర్తింపును సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుదుగా చెప్పుకొనే యునెస్కో గుర్తింపును ఏడాదికాలంలో రెండుసార్లు సాధించడం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత.