స్టార్ భామల మధ్య స్నేహ బంధం

నయనతార, సమంత కలిసి నటించిన మూవీ ఈనెల 28న రిలీజ్

Nayantara, Samantha’s friendship-

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘కాతువాకులు రెండు కాదల్’ ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయింది..విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రెండో హీరోయిన్ గా నటించింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విఘ్నేష్ శివన్ నయనతార, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తొలిసారిగా నయనతార, సమంత కలిసి నటించిన చిత్రమిది.

రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార , సమంత మధ్య సన్నివేశాలు ప్రధాన హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే సామ్ – నయన్ మధ్య మంచి అనుబంధం ఏర్పడి, అది కాస్తాఇపుడు డీప్ ఫ్రెండ్షిప్ గా మారిందని అంటున్నారు. . ఇటీవల జరిగిన నయనతార పుట్టిన రోజు వేడుకల్లో సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/