గాడ్ ఫాదర్ రెండో రోజు కలెక్షన్స్

బాక్స్ ఆఫీస్ వద్ద గాడ్ ఫాదర్ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ దసరా సందర్బంగా గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉండడం తో ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తున్నాయి.

రెండో రోజు వసూళ్లు చూస్తే..

నైజాంలో 2.38 కోట్లు
సీడెడ్ లో 1.96 కోట్లు
ఉత్తరాంధ్రలో 1.01 కోట్లు
ఈస్ట్ లో 51 లక్షలు
వెస్టులో 45 లక్షలు
గుంటూరులో 60 లక్షలు
కృష్ణాలో 49 లక్షలు
నెల్లూరులో 33 లక్షలు షేర్ వసూళ్ళను సాధించింది. ఇక మొత్తంగా రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.73 కోట్ల షేర్ కలెక్షన్స్ 13.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. 2.30 కోట్లు రాగా హిందీలో అలాగే రెస్టాఫ్ ఇండియా లో చూసుకుంటే 1.80 కోట్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ లో 2.55 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గాడ్ ఫాదర్ సినిమా 27.35 కోట్ల షేర్ రాగా 50.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.