మలక్ పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం..మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

హైదరాబాద్ లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం , మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం తో పలు ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి. దీంతో అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా ఈరోజు బుధువారం మలక్ పేట్ లో క్రాస్ రోడ్ వద్ద ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ను తప్పించపోయి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రంగా గాయాలు కావడం తో వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు ముందు భాగం దెబ్బతింది. దిల్ సుఖ్ నగర్ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంతో రోడ్ పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు. ఈ ప్రమాదం తో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు.