పల్లా రాజేశ్వర్ రెడ్డికి బండి సంజయ్ కౌంటర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. వరి కొనుగోలు విషయంలో గత కొద్దీ రోజులుగా తెరాస సర్కార్ ..కేంద్రం తో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఢిల్లీ లోను పెద్ద ఎత్తున దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేసారు. వరి ధాన్యం సేక‌ర‌ణ‌పై క‌నీస అవ‌గాహ‌న లేకుండా సంజయ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆయనకు వ‌రికి, గోధుమ‌ల‌కు కూడా తేడా తెలియ‌ద‌ని విమ‌ర్శించారు. వార్డు మెంబ‌ర్ కంటే త‌క్కువ‌గా దిగ‌జారి మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. అంతే కాదు బండి సంజ‌య్ చావాల‌ని కోరుకోవ‌డం లేదు.. కానీ ఆయ‌న చ‌స్తే రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇప్పిస్తామ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.

ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల ఫై సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ తాను చనిపోతే.. నా చావును కోరిన మూర్ఖుడికే నా పేరుమీద ఉన్న ఇన్సూరెన్స్‌ కు ఇచ్చే డబ్బులు ఇవ్వాల్సిందిగా నా భార్య కు చెబుతానని బండి సంజయ్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం మరింత పతనం కావాలని తాను అభిలషిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పోరాటం వ‌ల్లే కేసీఆర్ వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుండ‌ని అన్నారు. బీజేపీ నాయ‌కుల పోరాటంతో సీఎం కేసీఆర్ మెడ‌లు వంచామ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే వ‌రి ధాన్యం రాష్ట్ర ప్ర‌భుత్వం తోనే కొనుగోలు చేయిస్తామ‌ని చెప్పామ‌ని గుర్తు చూశారు.