అజారుద్దీన్‌కి మద్దతు పలికిన నవీన్‌ కుమార్‌ యాదవ్‌

తెలంగాణ లో కాంగ్రెస్ బలం రోజు రోజుకు మరింత పెరిగిపోతుంది. ఆరు నెలల క్రితం వరకు కూడా బిఆర్ఎస్ పోటీ అంటే బిజెపి పార్టీనే అని అంత అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ని అధ్యక్షా పదవి నుండి తప్పించడం..కవిత లిక్కర్ కేసు సైలెంట్ అవ్వడం తో బిఆర్ఎస్ – బిజెపి ఒక్కటే అని అంత ఫిక్స్ అయ్యారు. బిఆర్ఎస్ కు ప్రత్యర్థి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే అని నమ్మడం స్టార్ట్ చేసారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ సైతం దూకుడు పెంచింది. ఇతర పార్టీల నేతలు లాక్కోవడం దగ్గరి నుండి..ఆరు గ్యారెంటీ హామీలు ఇలా అన్ని కూడా సక్సెస్ అవుతూ వచ్చింది. దీంతో కాంగ్రెస్ కు ప్రజల్లో నమ్మకం పెరగడమే కాదు..ఇతర పార్టీల నేతలకు సైతం కాంగ్రెస్ లోకి వచ్చేలా చేసింది.

తాజాగా ఇప్పుడు ఇతర పార్టీల అభ్యర్థులు సైతం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా జూబ్లిహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌ సైతం కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కి మద్దతు పలికారు. నవీన్‌ కుమార్‌ యాదవ్‌ కాంగ్రెస్ లోకి రావడం హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్‌ యాదవ్‌కి మంచి రాజకీయ భవిష్యత్‌ కల్పిస్తామన్నారు. ఆయన రాక జూబ్లీహిల్స్‌లో గేమ్‌ చేంజర్‌గా మారనుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు.

ఎంఐఎం టికెట్‌ ఆశించి భంగపడ్డ నవీన్‌యాదవ్‌కు బీజేపీ గాలెం వేసింది. ఈ మేరకు ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి చర్చలు జరిపారు. అయితే నవీన్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపారు. జూబ్లీహిల్స్‌ 2014లో ఎంఐఎం అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ బరిలో నిలిచారు. ఆయనకు 41 వే656 ఓట్లు వచ్చాయి. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18 వేల 816 ఓట్లు సంపాదించుకున్నారు. మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన నవీన్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ నేతలు బుజ్జగించడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకుని హస్తం గూటికి చేరారు. ఫలితంగా దాదాపు 20వేల ఓటు బ్యాంకు ఉన్న నాయకుడు కాంగ్రెస్‌కి అండగా నిలిచినట్లైంది. వ్యక్తిగతంగా నవీన్‌ యాదవ్‌కు 10వేల ఓటర్ల మద్దతు ఉంది. ఆయన గతంలో రెండు సార్లు ఓడిపోవడం సహా మజ్లిస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదనే సానుభూతితో ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌కి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి