దక్షిణాఫ్రికా ఫై ఆస్ట్రేలియా విజయం..ఫైనల్ లో భారత్ తో ‘ఢీ’

ఆస్ట్రేలియా (Australia ) మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ (World Cup Final 2023) లో అడుగుపెట్టింది. గురువారం కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన రెండో సెమీ ఫైన‌ల్ (2nd Semi Final) మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా (South Africa) పై ఆస్ట్రేలియా విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరింది. దీంతో అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం (న‌వంబ‌ర్ 19న‌) జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ జ‌ట్టుతో ఆస్ట్రేలియా ఢీ (Australia Vs Team India Final) కొట్టబోతుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా మొదటి నుండి కూడా భారీ స్కోర్ గా దిశగా ట్రై చేయలేకపోయింది. కెప్టెన్ బావూమా డకౌట్ అవ్వడం.. ఆ తర్వాత డికాక్‌.. హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో కమ్మిన్స్‌కు దొరికిపోవడం ఇలా చకచకా జరగడం తో 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ 101 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించాడు. ఓవరాల్ గా 49.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 212 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి..214 పరుగులు చేసి ఫైనల్ లో అడుగుపెట్టింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ (62) హాఫ్ సెంచ‌రీ చేశాడు. స్టీవ్ స్మిత్ (30), డేవిడ్ వార్న‌ర్ (29), జోష్ జోష్ ఇంగ్లిస్ (25 నాటౌట్‌) లు రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో తబ్రైజ్ షమ్సీ రెండు వికెట్లు తీశాడు. కగిసో రబడ, మార్క్రామ్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్ లు ఒక్కొ వికెట్ తీశారు.