కెసిఆర్‌పై రేవంత్‌ రెడ్డి విమర్శలు

ఒక ఇంజినీర్ కు ఉన్న జ్ఞానం కూడా కెసిఆర్ కు లేదే: రేవంత్ రెడ్డి

Revanth reddy
Revanth reddy

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపి రేవంత్‌ రెడ్డి సిఎం కెసిఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కల్వకుర్తి లిఫ్ట్ ప్రాజెక్టుల పంపులన్నీ నీట మునిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ట్విట్టర్ ద్వారా రేవంత్ స్పందించారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి నాకంటే ఎక్కువ తెలిసినోడు ఎవడు అని చెప్పుకున్న కెసిఆర్ కు… కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్ లో ఓ ఇంజినీర్ కు ఉన్నంత జ్ఞానం కూడా లేదే అని ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. ఇది కల్వకుంట్ల అజ్ఞానమా? లేక ధన దాహమా? అని ప్రశ్నించారు. బ్లాస్టింగుల వల్ల లిఫ్ట్ పంపుల్లో ప్రకంపనలు వస్తున్నాయని హెచ్చరిస్తూ సూపరింటెండింగ్ ఇంజినీర్ రాసిన లేఖలు బట్టబయలు చేసిన వాస్తవాలు ఇవిగో అంటూ ఇంజినీర్ రాసిన లేఖను రేవత్ షేర్ చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/