లిప్ లాక్ తో తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించిన నరేష్ – పవిత్ర

ఎట్టకేలకు నరేష్ – పవిత్రలు తమ పెళ్లి కబురు ను అధికారికంగా ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా సీనియర్ నటులు నరేష్ – పవిత్ర లపై మీడియాలో అనేక కథనాలు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియా లో అయితే చెప్పాల్సిన పనిలేదు. పోలీస్ స్టేషన్ , కోర్ట్ ల వరకు కూడా వీరి వ్యవహారం వెళ్ళింది. కాగా ఇప్పుడు ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నరేష్ – పవిత్ర లు తమ పెళ్లి కబురు ను అధికారికంగా ప్రకటించారు.

నరేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కట్ చేసి కేక్ తినిపించి వారిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వీడియోలోనే త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కొత్త సంవత్సరం, కొత్త బంధం, మీ అందరి ఆశీస్సులు కావాలని ఈ వీడియో పోస్ట్ చేశాడు నరేష్. నరేష్ పవిత్రకి లిప్ కిస్ ఇచ్చి మరీ వీడియో పోస్ట్ చేయడంతో దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. నరేష్ తన మూడో భార్య రమ్యకి విడాకులు ఇచ్చి ఇప్పుడు నాలుగో భార్యగా పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఇది చెప్పడానికి ఇన్ని రోజులా..అప్పుడే చెప్పేస్తే ఇంత వరకు వచ్చేది కాదు కదా అంటూ కామెంట్స్ వేస్తున్నారు.