పోలీస్ ఆఫీసర్ ‘సత్య’గా సునీల్

కమెడియన్ కాస్త పోలీస్ గా మారాడు. కమెడియన్ గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్..ఆ తర్వాత హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. హీరోగా రెండు , మూడు సినిమాలు మంచి విజయాన్ని సాధించగా..ఆ తర్వాత అన్ని ప్లాప్స్ అయ్యాయి. దీంతో హీరోగా ఛాన్సులు తగ్గిపోయాయి. కలర్ ఫోటో , పుష్ప మూవీస్ తో విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. తాజాగా సునీల్ ‘కథ వెనుక కథ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సునీల్ ‘ఏసీపీ సత్య’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోజున సునీల్ పుట్టినరోజు కావడంతో, ఆయన పాత్రను పరిచయం చేస్తూ .. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఆయన తాలూకా పోస్టర్ ను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించాడు. కేశవ దీపక్ .. సత్యం రాజేశ్ .. శ్రీజిత ఘోష్ .. రఘుబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు సునీల్ పుష్ప 2 లో నటిస్తున్నాడు.