సిఎం జగన్‌పై మోడి సోదరుడి పొగడ్తలు

సిఎం జగన్‌ ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన వ్యక్తి

Prahlad Modi-cm jagan
Prahlad Modi-cm jagan

తిరుమల: ప్రధాని నరేంద్రమోడి సోదరుడు ప్రహ్లాద్‌ మోడి ఏపి సిఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సిఎం జగన్‌ ప్రజల కష్ట, సుఖాలు తెలిసిన వ్యక్తిని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి ఆయన అనునిత్యం శ్రమిస్తున్నారని ప్రహ్లాద్‌ మోడి అన్నారు. ద్వారకా తిరుమలలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో దేవతిలకులు, గాండ్లు, తెలకుల వర్గాలకు చెందిన వారు 14 లక్షల మంది వరకూ ఉన్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన ఈ కులస్తుల సమస్యలను తాను జగన్ దృష్టికి తీసుకుని వెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రహ్లాద్ మోడి, ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుని ధనుర్మాస పూజల్లోనూ పాల్గొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/