సొంత పార్టీ కార్యకర్తలపై రోజా పోలీస్‌ కేసు

Roja
Roja

నగరి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె రోజా తన సొంత పార్టీ కార్యకర్తలపై పోలీసు కేసు పెట్టింది. తనకారుపై జరిగిన దాడి కేసులో లక్ష్మణమూర్తి అనే కార్యకర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించింది. ఈ విషయం పై ఆమె జిల్లా ఎస్‌పితో కూడా మాట్లాడారు. దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందించారు. ఓ మహిళ ఎమ్మెల్యేగా ఉన్నానని గౌరవం లేకుండా తనపైనే ఇలా దాడికి ప్రయత్నిస్తారా అని రోజా మండిపడ్డారు. దాదాపు వంద మంది కార్యకర్తలు తనకారును అడ్డుకొనే ప్రయత్నం చేశారన్నారు. ఈ దాడి కేసులో హరీష్ సంపత్, సురేష్ రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తిపై… 143, 341, 427, 506, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ దాడి వెనుక రాజకీయనేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకల్‌గా ఉన్న అమ్ములు వర్గమే ఈ దాడికి దిగిందని రోజా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వీరి వెనుక జిల్లాకు చెందిన ముఖ్యమైన నేతలు కూడా ఉన్నారని ఆమె అంటున్నారు. గతంలో కూడా రోజాను ఓడించనాకి తన వెనుక ప్రయత్నాలు చేశారని రోజా పార్టీ హైకమాండ్‌తో పాటు.. సిఎం కార్యలయానికి తెలిపారు. ఈ ఘటనను సిఎం జగన్ దృష్టికి కూడా రోజా తీసుకెళ్లనున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/