పాశ్వాన్ కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి


న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. రామ్‌విలాస్ పాశ్వాన్ భౌతికకాయానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడి నివాళులర్పించారు. ఢిల్లీలోని మంత్రి నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. పాశ్వాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రధాని, రాష్ట్రపతితో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు పాశ్వాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మరోవైపు శనివారం పాట్నాలో పాశ్వాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
బీహార్‌కు చెందిన దళిత నేతగా రామ్‌విలాస్ ఎనలేని కీర్తిని గడించారు. లోక్‌జనశక్తి పార్టీని స్థాపించిన ఆయన.. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గత కొన్ని వారాల నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పాశ్వాన్ ఇటీవలే గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/