నేడు ఏపీకి తిరిగి రానున్న నారా లోకేష్

Nara Lokesh is returning to AP today

అమరావతిః టిడిపి అగ్రనేత నారా లోకేష్‌ నేడు ఏపీకి రానున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు . గన్నవరం నుండి నేరుగా రోడ్డు మార్గం గుండా రాజమండ్రి వెళ్ళనున్న నారా లోకేష్….రేపు ఉదయం మలాకత్ లో చంద్రబాబును కలవనున్నారు. కాగా, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా, కోర్టులో తాత్కలిక ఊరట దక్కడంతో లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి తిరుగు పయనమవుతున్నారు. గత 21రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్‌ సెప్టెంబర్ నెలాఖరులోనే ఏపీకి రావాలని భావించారు. అయితే కోర్టుల్లో చంద్రబాబు, లోకేష‌‌లకు సానుకూల ఫలితం రాకపోవడంతో ఢిల్లీలోనే ఉండిపోయారని టిడిపి వర్గాలు తెలిపారు. సెప్టెంబర్ 29 నుంచి రాజోలులో యువగళం పాదయాత్రను పున: ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నా చివరి నిమిషంలో దానిని రద్దు చేశారు.