హవాలా కింగ్ బాలినేని అంటూ లోకేష్ ఫైర్

తెలుగుదేశం నేత నారా లోకేష్..వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. గురువారం కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి..బాలినేని శ్రీనివాసరెడ్డిపై పలు ఆరోపణలు చేసారు. దీంతో కొంతమంది వైసీపీ మద్దతుదారులు..బాల వీరాంజనేయస్వామి ఇంటిపై దాడికి యత్నించారు. ఈ ఘటన తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు బాల వీరాంజనేయస్వామి కు ఫోన్ చేసి పరామర్శించారు.

ఈ వ్యవహారంపై నారా లోకేశ్ ట్విట్టర్ లో బాలినేనిఫై ఆగ్రహపు జ్వాలలు కురిపించారు . ‘హవాలా కింగ్ బాలినేని, నీ దాదాగిరీకి ఎక్స్ పైరీ డేట్ దగ్గరపడిందని’ హెచ్చరించారు. ‘నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతుడు, దళిత మేధావి అయిన కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?’ అంటూ మండిపడ్డారు. అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం ఉంటే… నీతికి నిలువుటద్దం వంటి మా స్వామి గారి ఇంటిపైకి దాడికి వచ్చిన మిమ్మల్నేం చేసినా పాపం లేదు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.