కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా

Palvai Sravanthi resigns from Congress party

హైదరాబాద్‌ః కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పాల్వాయి స్రవంతి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ఈరోజు మధ్యాహ్నం భారత రాష్ట్ర సమితి పార్టీలో జాయిన్ కానున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

అంతేకాకుండా ఆమె బాటలోనే మునుగోడు లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన చలమల బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి బిజెపి మునుగోడు టికెట్ కూడా ఇచ్చేసింది. ఇక ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీలో పాల్వాయి స్రవంతి చేరనుండటంతో మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది.